పబ్జీ ఆడొద్దని మందలించిన తండ్రి.. 9th క్లాస్ స్టూడెంట్ సూసైడ్

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-21 04:27:37  IST  )

ఫోన్‌లో ఆడుకునే ఆన్‌లైన్ గేమ్స్‌లో అత్యంత ప్రమాదకరమైనది పబ్జీ(Pubg Game).

పబ్జీ ఆడొద్దని మందలించిన తండ్రి.. 9th క్లాస్ స్టూడెంట్ సూసైడ్
X

దిశ, భైంసా: ఫోన్‌లో పబ్జీ గేమ్‌కు బానిసగా మారిన విద్యార్థి ప్రాణం తీసుకున్న ఘటన బుధవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని అనందనగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని మౌళాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్, సాయిప్రజ దంపతులు గత కొంత కాలంగా భైంసాలోని ఆనంద నగర్ కాలనీ నివాసముంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బేతి రిశేంద్ర హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి పూర్తి చేసుకొని, పదో తరగతిలో చేరాల్సి వుండగా, గత కొంత కాలంగా పబ్జీ గేమ్‌కు బానిస అయ్యాడు.

పదవ తరగతి కోసం పాఠశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టే చివరి ప్రయత్నంగా గత రెండు మూడు రోజుల నుంచి కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసింది. దీంతో డిప్రెషన్‌కు లోనై విద్యార్థి బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైంసా పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఏరియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం కోసం బాడీని తీసుకువచ్చరు.

Next Story