- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేడియంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తర మెక్సికోలోని శాన్ సాల్వడార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తర మెక్సికోలోని శాన్ సాల్వడార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లబ్ అలియాంజా-ఎఫ్ఏఎస్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు
Read more:
Next Story






