టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య కేసులో 9 మంది అరెస్ట్

by Ajay Maddhiboyina |

టీడీపీ నేత వీర‌య్య చౌద‌రి హత్య కేసును పోలీసులు చేదించారు. హత్య కేసులో మొత్తం 11 మంది నిందితుల‌ను గుర్తించారు.

టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్య కేసులో 9 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత వీర‌య్య చౌద‌రి హత్య కేసును పోలీసులు చేదించారు. హత్య కేసులో మొత్తం 11 మంది నిందితుల‌ను గుర్తించారు. వారిలో 9 మందిని అరెస్ట్ చేయ‌గా మ‌రో ముగ్గురు నిందితులు ప‌రారీలో ఉన్నారు. ప్ర‌స్తుతం మిగితా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీర‌య్య స్వ‌గ్రామం నాగుల‌ప్ప‌ల‌పాడు మండ‌లం అమ్మ‌న‌బ్రోలుకు చెందిన ఆళ్ల సాంబ‌య్య ప్ర‌ధాన కుట్ర‌దారుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో వీర‌య్య స్వ‌గ్రామానికి చెందిన సురేష్ మరియు దేవేంద్ర‌నాథ్ చౌద‌రి సైతం ఉన్న‌ట్టు గుర్తించారు.

ఇసుక వ్యాపారం చేసే వినోద్ మ‌రియు నెల్లూరుకు చెందిన కిరాయి గూండాల‌తో కలిసి ఈ హత్య చేసిన‌ట్టు పోలీసులు నిర్దారించారు. రాజ‌కీయ మ‌రియు వ్యాపారాల్లో విబేధాల కార‌ణంగానే ఈ హ‌త్య చేయించిన‌ట్టు తెలిపారు. ఇదిలా ఉంటే వీర‌య్య చౌద‌రిని గ‌త నెల 22న ఒంగోలులో దారుణంగా హ‌త్య చేసిన సంగతి తెలిసిందే. ఆయ‌న శ‌రీరంపై ఏకంగా యాభై క‌త్తిపోట్ల‌ను గుర్తించారు. గ‌త కొద్దిరోజులుగా ఆళ్ల సాంబ‌య్య వీర‌య్య చౌద‌రి హ‌త్య‌కు కుట్ర చేసిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

Next Story