యూపీలో దారుణం..8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య

by Ajay Maddhiboyina |

యూపీలో దారుణం జ‌రిగింది. ఫిరోజాబాద్‌లో 8ఏళ్ల బాలిక ఈ నెల 17వ తేదీన‌ అదృశ్యం అయ్యింది. హ‌త్రాస్ ప్రాంతానికి చెందిన బాలిక సెల‌వుల కోసం ఫిరోజాబాద్‌లోని త‌న అమ్మ‌మ్మ ఇంటికి వ‌చ్చింది.

యూపీలో దారుణం..8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: యూపీలో దారుణం జ‌రిగింది. ఫిరోజాబాద్‌లో 8ఏళ్ల బాలిక ఈ నెల 17వ తేదీన‌ అదృశ్యం అయ్యింది. హ‌త్రాస్ ప్రాంతానికి చెందిన బాలిక సెల‌వుల కోసం ఫిరోజాబాద్‌లోని త‌న అమ్మ‌మ్మ ఇంటికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో బాలిక అదృశ్యం అవ్వ‌గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హ‌త్య చేసిన‌ట్టు గుర్తించారు. బాలిక మృత‌దేహాన్ని ఓ ఇంట్లోని సంచిలో ఇటుక‌ల కుప్ప మ‌ధ్య‌లో గుర్తించారు. కౌశ‌ల్ కుశ్వాహా అనే వ్య‌క్తి బాలిక‌పై అత్యాచారం చేసి హ‌త్య చేసిన‌ట్టు నిర్దారించారు.

8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యఈ కేసులో నిందితుడితో పాటు అత‌డి తల్లి దండ్రులు మ‌రియు సోద‌రుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని ప‌ట్ట‌కునే స‌మ‌యంలో పారిపోవ‌డంతో అత‌డిపై కాల్పులు జ‌రిపిన‌ట్టు తెలిపారు. దీంతో అత‌డి కాలికి బుల్లెట్ గాయం అయినట్టు పేర్కొన్నారు. గ‌తంలో నిందితుడు ఓ గోల్డ్ చైన్ దొంగ‌త‌నం కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై వ‌చ్చిన‌ట్టు తెలిపారు. బాలిక మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. కాగా 8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితున్ని ప్రాణాలతో విడిచిపెట్టవద్దని ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story