8 మంది ఆర్టీసీ ఉద్యోగుల సస్పెండ్..!

by Disha Web Desk 11 |
8 మంది ఆర్టీసీ ఉద్యోగుల సస్పెండ్..!
X

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసి రీజినల్ మేనేజర్ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న 8 మంది ఉద్యోగులు అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అకౌంట్స్ డిపార్టుమెంట్ లో నలుగురు, పర్సనల్ డిపార్టుమెంట్ లో ఇద్దరు, ఇక్కడ పని చేసి బదిలీ పై వెళ్లిన ఒక అకౌంట్స్ ఆఫీసర్, ఒక సెక్యూరిటి అధికారి అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయినట్లు తెలిసింది. మహబూబ్ నగర్ డిపోలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న కార్మికుల జీతాల మంజూరి కోసం వారితో గత కొంతకాలం నుంచి పలుమార్లు ముడుపులు డిమాండ్ చేసి వసూలు చేసినట్లు తెలిసింది. ఈ తతంగమంతా పై ఉన్నత అధికారులకు పిర్యాదులు వెళ్లాయి.

ఈ మేరకు హైదరాబాద్ నుంచి ముగ్గురు విజిలెన్స్ అధికారులు జిల్లా కేంద్రానికి చేరుకొని దర్యాప్తు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ఫోన్ పే, గుగూల్ పే ద్వారా సస్పెండ్ అయినవారికి ముడుపులు ఇచ్చినట్లు నిర్థారణ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలతో ఎనిమిది మంది అధికారులు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సస్పెషన్లు నిజమేనని ఒక అధికారి దృవీకరించారు. ఈ వసూళ్లలో లాభింగ్ నడిపిన అకౌంట్స్ డిపార్టుమెంట్ లో అవుట్ సోర్సింగ్ అంటెండర్ గా పని చేస్తున్న వ్యక్తిని కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిసింది. ఇంకా కొందరు కూడా ముడుపుల కోసం కార్మికులను వేధిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed