ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

by Malleboina Mahesh |   (  Updated:2025-03-10 13:08:52  IST  )

సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు.. ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు.. ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది (ఎనిమిది మంది) అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై డీఎస్పీ గాయత్రి తివారీ (DSP Gayatri Tiwari) మాట్లాడుతూ.. నిన్న రాత్రి సిద్ధిలో కారు ట్రక్కును ఢీకొట్టడంతో చాలా మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. “నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఉట్ని పెట్రోల్ పంప్ సమీపంలో బల్కర్, కారు మధ్య జరిగిన ప్రమాదం గురించి మాకు సమాచారం అందింది. దాదాపు 13 మంది గాయపడ్డారు.కనీసం ఎనిమిది మంది మరణించారు. బల్కర్ సిద్ధి నుండి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story