మోమోస్ పిచ్చి.. ఫ్రీ గా వస్తాయని రూ.85 లక్షల విలువైన నగలిచ్చేశాడు

by Naga Rani Yarlagadda |

మోమోస్ అంటే చాలామందికి ఇష్టం. వీటిలో రకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మోమోస్ కూడా ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ గా మారిపోయింది.

మోమోస్ పిచ్చి.. ఫ్రీ గా వస్తాయని రూ.85 లక్షల విలువైన నగలిచ్చేశాడు
X

దిశ, వెబ్‌డెస్క్: మోమోస్ అంటే చాలామందికి ఇష్టం. వీటిలో రకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మోమోస్ కూడా ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ గా మారిపోయింది. ఈ మోమోస్ కు అలవాటుపడిన ఓ బాలుడు.. వ్యాపారుడి మాటలు నమ్మి ఇంట్లోని నగలు తీసుకెళ్లి అతనిచేతిలో పెట్టాడు. వాటి విలువ అక్షరాలా రూ.85 లక్షలు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని డియోరియా నగరంలో మోమోస్ అమ్ముకునే వ్యక్తి.. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి బలహీనతను కనిపెట్టాడు. ఆ విద్యార్థి రోజూ మోమోస్ ను ఇష్టంగా తినడాన్ని గమనించిన అతను.. మరో ఇద్దరితో కలిసి ఓ ప్లాన్ వేశాడు. తన ఇంట్లో ఉన్న నగలు తెచ్చిస్తే రోజూ ఫ్రీగా మోమోస్ ఇస్తానని చెప్పాడు.

అతని మాటలు నమ్మిన విద్యార్థి.. తన ఇంట్లో ఉన్న రూ.85 లక్షల విలువైన నగలను రోజూ ఒక్కొక్కటిగా తీసుకెళ్లి వారికి అప్పగించాడు.అవి తీసుకున్న ముగ్గురు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి విమలేష్ మిశ్రా.. తన కొడుకుని ముగ్గురు వ్యక్తులు మ్యానిప్యులేట్ చేశారని, అతని బలహీనతను వాడుకుని నగలు కాజేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరి ఇంటికి వచ్చి తన నగల గురించి అడిగినపుడు నగలు పోయినట్లు గుర్తించామని తెలిపాడు. తన కొడుకుని నిలదీయగా.. తానే మోమోస్ కోసం ఆ షాపువాడికి ఇచ్చినట్లు చెప్పాడని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Next Story