సెప్టిక్ ట్యాంక్‌లో 769 మంది పిల్లల మృతదేహాలు..

by Sujitha Rachapalli |

సాధారణంగా అనాథ ఆశ్రమాలు సేఫ్ అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ వింటే గుబులు పుట్టడం ఖాయం. ఐర్లాండ్‌లోని టువామ్, కౌంటీ గాల్వేలో ఉన్న సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్‌కు చెందిన

సెప్టిక్ ట్యాంక్‌లో 769 మంది పిల్లల మృతదేహాలు..
X

దిశ, వెబ్‌సైట్ : సాధారణంగా అనాథ ఆశ్రమాలు సేఫ్ అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ వింటే గుబులు పుట్టడం ఖాయం. ఐర్లాండ్‌లోని టువామ్, కౌంటీ గాల్వేలో ఉన్న సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్‌కు చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో దాదాపు 769 మంది పిల్లల శవాలు గుర్తించబడ్డాయి. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మదర్ అండ్ బేబీ హోమ్‌కు సంబంధించిన భూమిలోనే ఎక్కువగా పిల్లల మానవ అవశేషాలు కనుగొనబడ్డాయి. నిజానికి ఈ స్థలం 1925 నుండి 1961 వరకు బాన్ సెకోర్స్ సన్యాసినీలు నడిపిన హోమ్‌లో భాగంగా ఉండగా.. నవజాత శిశువుల నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు వరకు ఉన్న 769 మంది పిల్లలు చనిపోయినట్లు నమ్ముతున్నారు. వీరిలో చాలామంది వాడుకలో లేని సీవేజ్ ట్యాంక్‌లో ఖననం చేయబడ్డట్లు తెలుస్తోంది.

స్థానిక చరిత్రకారిణి కాథరిన్ కార్లెస్ 2014లో ఈ విషాదాన్ని బయటపెట్టగా.. దీని ఫలితంగా ఐరిష్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటైంది. 2021 నివేదిక ప్రకారం ఐర్లాండ్‌లోని మదర్ అండ్ బేబీ హోమ్‌లలో 9,000 మంది పిల్లలు నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. చర్చి, స్టేట్ ఈ సంస్థలను నడపడంలో సహకరించాయి. వివాహం కాని తల్లులు, వారి పిల్లలకు ఆశ్రయమిచ్చాయి. కాగా 2025 జూలైలో అవశేషాలను తిరిగి పొందడానికి, గుర్తించడానికి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. DNA పరీక్షల ద్వారా వాటిని బంధువులతో కనెక్ట్ చేయడం జరుగుతుంది. కాగా ఈ ఘటన ఐర్లాండ్‌లోని సంస్థాగత దుర్వినియోగం, రహస్యాల చీకటి చరిత్రను హైలైట్ చేస్తుంది.

LINK

Next Story