రోడ్డు ప్రమాదంలో 71 మంది దుర్మరణం.. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-20 01:58:05  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా 71 మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన అఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)లోని పశ్చిమ హెరాట్ ప్రావిన్స్‌ హెరాట్-ఇస్లాం ఖలా హైవేపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో 71 మంది దుర్మరణం.. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా 71 మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన అఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)లోని పశ్చిమ హెరాట్ ప్రావిన్స్‌ హెరాట్-ఇస్లాం ఖలా హైవేపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇరాన్ (Iran) నుంచి బహిష్కరించబడిన ఆఫ్ఘన్ వలసదారులను తీసుకెళ్తున్న బస్సును బైక్ ఢీకొట్టింది. దీంతో బస్సులోని ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోగా చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. వారిలో 17 మంది చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు కూడా స్పాట్‌లోనే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మాత్రమే సజీవంగా బయటపడ్డారు. కాగా, 2025 నుంచి ఇరాన్‌లో ఉంటున్న 14 లక్షలకు పైగా అఫ్ఘాన్ వలసదారులను ఆ దేశం సరిహద్దు నియంత్రణల కారణంగా బహిష్కరణ వేటు వేశాయి.

Next Story