ఏపీలో దారుణం..6వ తరగతి బాలికపై అత్యాచారం

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌ను స్కూల్ ద‌గ్గ‌ర వ‌దిలిపెడ‌తాన‌ని బైక్ ఎక్కించుకున్న ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారం చేశాడు.

ఏపీలో దారుణం..6వ తరగతి బాలికపై అత్యాచారం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైన‌ర్ బాలిక‌ను స్కూల్ ద‌గ్గ‌ర వ‌దిలిపెడ‌తాన‌ని బైక్ ఎక్కించుకున్న ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలో చోటు చేసుకుంది. బ్రాహ్మ‌ణ‌పల్లికి చెందిన 40 ఏళ్ల ప్ర‌సాద్ అనే వ్య‌క్తి అదే గ్రామానికి చెందిన 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న 11 ఏళ్ల బాలిక‌పై అత్యాచార‌ని పాల్ప‌డ్డాడు.

బాలిక స్కూలుకు వెళుతుండ‌గా చూసిన నింధితుడు ఆమెను స్కూల్ ద‌గ్గ‌ర వ‌దిలిపెడ‌తాన‌ని న‌మ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అనంత‌రం మారుమూల ప్ర‌దేశానికి తీసుకువెళ్లి దారుణానికి పాల్ప‌డ్డాడు. బాలిక ఈ విష‌యం త‌ల్లి దండ్రుల‌కు చెప్ప‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి నింధితుడిని అరెస్ట్ చేశారు. నింధితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని గ్రామ‌స్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story