- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళ్లు, చేతులు కట్టేసి.. వడ్డీ వ్యాపారి దారుణ హత్య
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్యాల్ గ్రామంలో 62ఏళ్ల వృద్ధుడు తేజ్‌పాల్‌ను దారుణంగా హతమార్చారు దుండగులు. చేతులు, కాళ్లు కట్టేసి.. గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్యాల్ గ్రామంలో 62ఏళ్ల వృద్ధుడు తేజ్‌పాల్‌ను దారుణంగా హతమార్చారు దుండగులు. చేతులు, కాళ్లు కట్టేసి.. గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులంతా గణపతి నిమజ్జనం కోసం వెళ్లగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే తేజ్‌పాల్ వడ్డీ వ్యాపారి కాగా డబ్బుల వివాదమే ఈ హత్యకు దారితీయొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ కోణంలో విచారణ చేపడుతున్నారు. కాగా ఈ ఘటన డబ్బు విషయంలో గొడవలు ఎంత వరకైనా తీసుకొళ్లచ్చని.. ప్రాణాలను సైతం హరిస్తాయని హైలెట్ చేస్తోంది.
Next Story






