Afghanistan earthquake : అర్ధరాత్రి భారీ భూకంపం.. 600లకు చేరిన మృతుల సంఖ్య

by Malleboina Mahesh |   (  Updated:2025-09-01 16:12:04  IST  )

అర్ధరాత్రి వచ్చిన భారీ భూకంపం వల్ల 600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఆదివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లోని ఈశాన్య కునార్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది.

Afghanistan earthquake  : అర్ధరాత్రి భారీ భూకంపం.. 600లకు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: అర్ధరాత్రి వచ్చిన భారీ భూకంపం (huge earthquake) వల్ల 600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఆదివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) లోని ఈశాన్య కునార్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి 11. 30 గంటలకు 6.3 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో.. ఈశాన్య కునార్ ప్రావిన్స్‌లో వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో నిద్రలోనే వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం వరకు భూకంపం ప్రాంతం నుంచి ఎటువంటి కమ్మూనికేషన్ లేకపోవడంతో మృతుల వివరాలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

తాజాగా స్థానిక అధికారులు.. 600 మంది చనిపోయినట్లు (600 people dead) అధికారికంగా ప్రకటించారు. అలాగే మరో 800 మంది తీవ్రంగా గాయపడ్డారని, చాలా ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతోందని, మృతుల సంఖ్య 1500 లకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుల సంఖ్య (Death toll) భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించగా.. పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Next Story