- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాంత్రికుడి మాయలోపడిన వదిన.. అర్ధరాత్రి ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఐదుగురు..
మాంత్రికుడి మాయలో పడిన ఓ మహిళ ఘోరానికి పాల్పడింది. బంగారంపై ఉన్న దురాశతో ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలను తీసింది.

దిశ, వెబ్‌డెస్క్ : మాంత్రికుడి మాయలో పడిన ఓ మహిళ ఘోరానికి పాల్పడింది. బంగారంపై ఉన్న దురాశతో ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలను తీసింది. నరబలి ఇస్తే గుప్తనిధి సొంతం అవుతుందని క్షుద్రపూజలు చేసే వ్యక్తి చెప్పిన మాటలు విని తన ఆరేళ్ల మరదలిని హత్య చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 11న ముంగేలి జిల్లా కోషాబాది గ్రామంలోని తన తల్లి పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాటి నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య జరిగిన నాలుగు నెలలకు నిందితులను పోలీసులు గుర్తించారు. కిడ్నాప్, హత్య ఎలా జరిగింది? ఎవరు చేయించారు? ఎవరు చేశారో పూర్తి ఆధారాలతో పోలీసులకు మీడియాకు వెల్లడించారు.
నరబలి ఇస్తే గుప్త నిధులు లభిస్తాయని బాలిక వదినకు క్షుద్రపూజలు చేసే వ్యక్తి చెప్పాడు. అతని మాటలు నమ్మిన మహిళ తన ఇంట్లోనే ఉన్న ఆరేళ్ల మరదలిని బలి ఇవ్వడానికి పూనుకున్నది. దీనిలో భాగంగా స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తికి రూ.500 ఇచ్చి తన మరదలిని కిడ్నాప్ చేసి శ్మశానానికి తీసుకురావాలని కోరింది. అతడు ఏప్రిల్ 11న ఇంట్లో తన తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిపోయాడు. ఉదయాన్నే చూసిన తల్లికి బిడ్డ కనిపించకపోవడంతో ఇంటిచుట్టుపక్కల వెతికింది. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ముంగేలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులకు చిన్నారి ఆచూకీ ఎక్కడా లభించలేదు. ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు మూడు నెలలుగా సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ లోకెషన్లను అనాలసిస్ చేసి చిన్నారి వదినను అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకు ఏం తెలియదని బుకాయించినా సాంకేతిక ఆధారాలు చూపించడంతో అసలు విషయం చెప్పక తప్పలేదు. గుప్తనిధుల కోసమే తన ఆరేళ్ల మరదలిని శ్మశానంలో బలి ఇచ్చి పూజలు చేశామని చెప్పింది. దీంతో ఆ మహిళతోపాటు మాంత్రికుడిని, కిడ్నాప్‌నకు పాల్పడ్డ వ్యక్తితో వీరికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురిని ఈ హత్య కేసులో అరెస్ట్ చేసి సోమవారం జైలులో రిమాండ్ చేశారు.






