భర్తతో అక్రమ సంబంధం.. 56ఏళ్ల మహిళ గొంతు కోసిన భార్య

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-15 19:47:09  IST  )

ఈ మధ్య అక్రమ సంబంధాలు.. దీని కారణంగా హత్యలు.. పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. భర్త, భార్యను చంపడమో.. భార్య, భర్తను మర్డర్ చేయడమో జరుగుతుంది. కానీ ఇక్కడ భార్య ఆ గ్రామంలోని ఓ మహిళను హత్య చేసింది. తన భర్తతో

భర్తతో అక్రమ సంబంధం.. 56ఏళ్ల మహిళ గొంతు కోసిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య అక్రమ సంబంధాలు.. దీని కారణంగా హత్యలు.. పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. భర్త, భార్యను చంపడమో.. భార్య, భర్తను మర్డర్ చేయడమో జరుగుతుంది. కానీ ఇక్కడ భార్య ఆ గ్రామంలోని ఓ మహిళను హత్య చేసింది. తన భర్తతో ఇల్లీగల్ ఎఫైర్‌లో ఉన్న 56ఏళ్ల మహిళ గొంతు కోసి కిరాతకంగా చంపింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లా ప్రేమ్‌ నగర్‌కు చెందిన ఇంద్రావతి.. తన భర్తకు అదే గ్రామానికి చెందిన ఝుంకీ దేవీతో ఇల్లీగల్ రిలేషన్ ఉందని తెలిసింది. అటు భర్త, ఇటు ఝుంకీ దేవిని ఈ రిలేషన్‌ను ఎండ్ చేయాలని సూచించింది. కానీ ఇద్దరు అసలు సంబంధం ఉందని ఒప్పుకోకపోగా.. అదే పని కంటిన్యూ చేశారు. దీంతో తట్టుకోలేకపోయిన ఇంద్రావతి.. ఝుంకీ దేవిని కత్తితో నరికి చంపింది. ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ హత్య చేయాల్సి వచ్చిందని.. ఇంద్రావతి పోలీసుల ముందు తప్పు ఒప్పుకుంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లోతుగా విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

Next Story