- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్లలో కలకలం..5 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి
కోరుట్ల పట్టణంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరిని కలిచి వేసే ఈ సంఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.

X
దిశ, కోరుట్ల : కోరుట్ల పట్టణంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరిని కలిచి వేసే ఈ సంఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శ నగర్ కాలానికి చెందిన ఆకుల రాము - కూతురు హితిక్ష (5) సాయంత్రం నుండి కనిపించకుండాపోయింది. కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇంతలో పక్కింటి బాత్రూంలో శవమై కనిపించింది. ఈ సంఘటన కోరుట్ల పట్టణ ప్రజలను కలిచి వేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. బాలిక మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






