499 న్యూడ్ వీడియోలు.. మస్తాన్ సాయి కేసులో కీలక విషయాలు

by Yella Dhawani Reddy |

తవ్వే కొద్దీ మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

499 న్యూడ్ వీడియోలు.. మస్తాన్ సాయి కేసులో కీలక విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తవ్వే కొద్దీ మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మస్తాన్ సాయిని మూడు రోజలు పాటు పోలీసులు విచారించారు. హార్డ్ డిస్క్, డ్రగ్స్, పార్టీస్, సాఫ్ట్ వేర్ అన్నింటి గురించి పోలీసులు ప్రశ్నించగా.. కీలక విషయాలు బయటపడ్డాయి.

పోలీసులు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్‌ను తెరిచారు. అందులో మొత్తం 17 ఫోల్డర్లు ఉండగా.. 2500కు పైగా ఫోటోలు, 499కు పైగా ప్రైవేట్ వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్క్‌లో మొత్తం ఆరుగురు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎక్కువగా లావణ్యతో పాటు మస్తాన్ గర్ల్ ఫ్రెండ్స్, తన భార్యకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. లావణ్య ఫోన్ నుంచి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్‌ను క్విక్ షేర్ ద్వారా వచ్చినట్టు గుర్తించారు. హార్డ్‌డిస్కులో ఇతరుల ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఇక వీటిలో ఎక్కువగా వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్, వారితో గదిలో ప్రైవేట్‌గా ఉన్న వీడియోలు ఉన్నాయి. వాటిని వాళ్ళకి తెలీకుండా సీక్రెట్‌గా రికార్డు చేసినట్టు మస్తాన్ సాయి ఒప్పుకున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇలా రహస్యంగా వీడియోలను, ఫొటోలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కస్టడీ సందర్భంగా డ్రగ్స్‌ కొనుగోలు గురించి ప్రశ్నించగా మస్తాన్‌ సాయి నోరు విప్పలేదు. మస్తాన్‌ సాయి మీద గతంలో రెండు డ్రగ్స్‌ కేసులున్నాయి. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. హార్డ్‌డిస్కులో ఉన్న వీడియోల్లో డ్రగ్స్‌ పార్టీల్లో పాల్గొన్న వ్యక్తులెవరో పరిశీలించి చెబుతానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

కాగా, మస్తాన్‌సాయి తన వీడియోలు సేకరించినట్లు గుర్తించిన లావణ్య గతేడాది నవంబరులో అతడి దగ్గరున్న హార్డ్‌ డిస్కును స్వాధీనం చేసుకుంది. కొన్నిరోజులకు ఇది గుర్తించిన నిందితుడు అందులోని వీడియోలు బయటకు పొక్కితే తన బండారం బయటపడుతుందని భయపడ్డాడు. హార్డ్‌ డిస్క్‌ కోసం అవసరమైతే చంపేస్తానంటూ లావణ్యను బెదిరించాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఆమె మీద దాడికి పాల్పడ్డాడు. తప్పించుకున్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు.

Next Story