భారీ అగ్ని ప్రమాదం.. దాదాపు 400 బైక్ లు దగ్ధం

by Ajay Maddhiboyina |

కేర‌ళ‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 400 బైకులు ద‌గ్దం అయ్యాయి. కేర‌ళ‌లోని త్రిశూర్ రైల్వే స్టేష‌న్ పార్కింగ్ స్థ‌లంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

భారీ అగ్ని ప్రమాదం.. దాదాపు 400 బైక్ లు దగ్ధం
X

దిశ‌, వెబ్ డెస్క్: కేర‌ళ‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 400 బైకులు ద‌గ్దం అయ్యాయి. కేర‌ళ‌లోని త్రిశూర్ రైల్వే స్టేష‌న్ పార్కింగ్ స్థ‌లంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విద్యుత్ తీగ‌ల వ‌ల్ల వ‌చ్చిన నిప్పు ర‌వ్వ‌ల కార‌ణంగా మంట‌లు చెల‌రేగి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ఒక బైక్ నుండి మ‌రో బైక్ కు మంట‌లు వ్యాపించ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త పెరిగిన‌ట్టు చెబుతున్నారు. పార్కింగ్ లో మొత్తం 600 బైక్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌డంతో మంటలు ఆర్పి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. బైక్ ల‌లో పెట్రోల్ నిండుగా ఉండ‌టం వ‌ల్ల ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువైంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. మొద‌ట ఒక బైక్ కు నిప్పు అంటుకుని అది పేల‌డంతో మంట‌లు వేగంగా వ్యాపించాయ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు రైల్వే అధికారుల నిర్లక్ష్యం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Next Story