రాష్ట్రంలో దారుణం.. నాలుగేళ్ల బాలికపై తాత అత్యాచారం

by Sujitha Rachapalli |

హర్యానాలో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది. నమ్మిన వ్యక్తే ద్రోహం చేశాడు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఇన్సిడెంట్ సమాజంలో నమ్మకం, బంధాల విలువను ప్రశ్నిస్తుంది. బలహీనమైన చిన్న పిల్లలను

రాష్ట్రంలో దారుణం.. నాలుగేళ్ల బాలికపై తాత అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్ : హర్యానాలో హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది. నమ్మిన వ్యక్తే ద్రోహం చేశాడు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఇన్సిడెంట్ సమాజంలో నమ్మకం, బంధాల విలువను ప్రశ్నిస్తుంది. బలహీనమైన చిన్న పిల్లలను రక్షించేందుకు మరింత బలమైన రక్షణ చర్యల ఆవశ్యకతను ఎత్తిచూపుతుంది. పానిపట్‌ సెక్టార్ 13-17 పీఎస్‌కు చెందిన రాంభాజ్(55) అలియాస్ పప్పుతో తమ నాలుగేళ్ల పాపను ఆడుకునేందుకు నమ్మకంగా అనుమతించేవారు తల్లిదండ్రులు. పాప కూడా అతన్ని తాత అంటూ ఆప్యాయంగా పిలిచేది. కానీ పప్పు మాత్రం తన కామవాంఛకు చిన్నారిని బలితీసుకున్నాడు. జీవితాంతం మరిచిపోలేని విషయానికి కారణమయ్యాడు. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేశారు.

Next Story