వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. కన్న కూతురిని కిరాతకంగా చంపిన మహాతల్లి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బులంధ్‌షహర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగౌరా పీఎస్ పరిధిలో మూడేళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశారు తల్లి, ఆమె ప్రియుడు. వివరాల్లోకి వెళ్తే.. నగౌరా పీఎస్ పరిధికి చెందిన సీమా తన భరణం తర్వాత యతేంద్ర అనే వ్యక్తితో కలిసి జీవిస్తుంది.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. కన్న కూతురిని కిరాతకంగా చంపిన మహాతల్లి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బులంధ్‌షహర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగౌరా పీఎస్ పరిధిలో మూడేళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశారు తల్లి, ఆమె ప్రియుడు. వివరాల్లోకి వెళ్తే.. నగౌరా పీఎస్ పరిధికి చెందిన సీమా తన భరణం తర్వాత యతేంద్ర అనే వ్యక్తితో కలిసి జీవిస్తుంది. కానీ సీమా కూతురు దివ్యాంశి తమ సుఖమైన జీవితానికి అడ్డుగా మారిందని, తన కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బాలికను హత్య చేసేందుకే డిసైడ్ అయ్యారు. మొదట తలపై గట్టిగా బాదిన ఇద్దరు.. ఆ తర్వాత ముఖాన్ని చేతితో మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని నరౌరా గంగా కాలువలో పడేశారు.

ఆ తర్వాత డౌట్ రాకుండా ఉండేందుకు సీమా తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అహ్మద్‌గఢ్‌లోని లల్తేష్, అతని సహచరులపై కిడ్నాప్, మర్డర్ ఆరోపణలు చేసింది. కానీ అక్టోబర్ 1న దిశ్యాంశీ మృతదేహం కాలువలో కనుగొన్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డ్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సరిగ్గా విచారించగా సీమా తప్పు ఒప్పుకుంది. దీంతో నిందితులు ఇద్దరిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

Next Story