- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిలాడీ లేడీ.. ఏకంగా రెండున్నర కిలోల బంగారం చోరీ
ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. శ్యామ్ లాల్ జ్యువెలర్స్‌లో దాదాపు రెండున్నర కిలోల బంగారం చోరీ చేయబడిందని తేలింది. అది కూడా అందులో పనిచేసే ఎంప్లాయీ కావడం విశేషం. బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్న కోమల్ శ్రీవాత్సవ.. కొవిడ్ తర్వాత

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. శ్యామ్ లాల్ జ్యువెలర్స్‌లో దాదాపు రెండున్నర కిలోల బంగారం చోరీ చేయబడిందని తేలింది. అది కూడా అందులో పనిచేసే ఎంప్లాయీ కావడం విశేషం. బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తున్న కోమల్ శ్రీవాత్సవ.. కొవిడ్ తర్వాత రూ. 22వేల వేతనానికి జాబ్‌లో జాయిన్ అయింది. అప్పటి నుంచి అంటే దాదాపు నాలుగేళ్లుగా దొంగతనం చేస్తూ వస్తుంది. స్టాక్ వెరిఫికేషన సమయంలో లాకర్‌లోని బంగారు వస్తువులను కొద్దికొద్ది మొత్తంలో చోరీ చేసేది. బ్రేస్‌లెట్స్, నాణేలు, ఉంగరాలు లాంటివి తీసుకుని శారీలో దాచుకుని బయటకు వెళ్లేది. వాటిని లోకల్ మార్కెట్‌లో కరిగించి.. భర్త సహాయంతో అమ్మేసేదని తెలుస్తోంది.
అక్టోబర్ 15, 2024న సీసీటీవీ ఫుటేజీలో వస్తువుల దుస్తుల్లో పెట్టుకోవడం కనిపించింది. కానీ ఆమెపై నమ్మకం కారణంగా వదిలేశారు. అయితే ధంతేరస్ ముందు స్టాక్ ఆడిట్ సమయంలో ఇంబ్యాలెన్స్ వెలుగులోకి వచ్చింది. ఓ కస్టమర్ బైబ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా తన బంగారాన్ని తిరిగి పొందాలని అడగడంతో.. అది కరిగిపోయిందని సమాధానం చెప్పింది కోమల్. దీంతో కౌంటర్ స్టాఫ్.. మేనేజర్ ధీరజ్ ధాల్‌ను అప్రమత్తం చేశారు.
ఆయన ఇటీవలి సీసీటీవీ ఫుటేజ్‌ను చూసి పూర్తి ఇన్వెంటరీ రికన్సిలియేషన్ చేశారు. ఇది 2.5 కేజీల ఇంబ్యాలెన్స్‌ను నిర్ధారించింది. అక్టోబర్ 19న ఆమె ఇంటికి వెళ్లి అడగ్గా.. తప్పు ఒప్పుకుంది. అక్కడ లక్షల రూపాయల విలువైన అదనపు బంగారు ఆభరణాలు దొరికాయి. ఆమె వేతనం తక్కువగా ఉన్నప్పటికీ. రూ. 75 లక్షల ఫ్లాట్ కొనడం, కార్ లోన్ తీర్చడం వంటి విలాసవంతమైన లైఫ్ స్టైల్ అనుమానాలను మరింత పెంచింది. దొంగతనం ద్వారా వచ్చిన డబ్బును ఇందుకు ఉపయోగించిందని తేలింది. ఈ విషయంపై మేనేజర్ ధీరజ్ ధాల్ గోమతీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కోమల్, ఆమె భర్త రితేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.






