దళిత యువకుడిపై దాడి.. బలవంతంగా మూత్రం తాగించి మ‌రీ !

by velandi.Saikiran |

తాజాగా ఓ 25 ఏళ్ల దళిత కుర్రాడిపై అత్యంత దారుణంగా దాడి చేసి, మూత్రం కూడా తాగించారట. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో

దళిత యువకుడిపై దాడి.. బలవంతంగా మూత్రం తాగించి మ‌రీ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమలు చేసిన దళితులపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ 25 ఏళ్ల దళిత కుర్రాడిపై అత్యంత దారుణంగా దాడి చేసి, మూత్రం కూడా తాగించారట. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ సంఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిండ్ జిల్లాలో షెడ్యూల్ కులాల కు చెందిన 25 ఏళ్ల కుర్రాడు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అకుత్‌పురా గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో తన అత్తగారింటికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి బాధితున్ని కిడ్నాప్ చేశారు. ఓ SUV వాహనంలో అతన్ని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదారు. ప్లాస్టిక్ పైపులతో కూడా కొట్టారట ముగ్గురు వ్యక్తులు. తీవ్రంగా గాయపడిన బాధితుడితో మూత్రం కూడా తాగించారని పోలీసులు గుర్తించారు.

అయితే ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వెంటనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ప్రధాన నిందితుడి దగ్గర బాధితుడు డ్రైవింగ్ చేసేవాడట. చెప్పకుండా ఆ డ్రైవర్ ఉద్యోగం మానేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పగ పెంచుకుని ఇలా దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story