- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేసారి 24 మంది ట్రాన్స్‌జెండర్ల ఆత్మహత్యయత్నం
ఒకేసారి 24 మంది ట్రాన్స్‌జెండర్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో ఇండోర్ లో చోటు చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఒకేసారి 24 మంది ట్రాన్స్‌జెండర్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో ఇండోర్ (Indoor)లో చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన 24 మంది ఫ్లోర్ క్లీనర్‌ను తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం జర్నలిస్టులుగా నటిస్తూ ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసినట్లు ట్రాన్స్ జెండర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్షయ్ కుమావున్, పంకజ్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులపై అత్యాచారం, దోపిడీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసు అధికారులు మాత్రం వారి ఫిర్యాదులపై సరిగ్గా స్పందించలేదు.
అధికారిక ఫిర్యాదు చేసినప్పటికీ, తాము ఆలస్యంగా స్పందించడంతో నిందితుల నుంచి తాము వేధింపులు ఎదుర్కొన్నామని బాధితులు ఆరోపించారు. అలాగే వారు సామూహికంగా వెళ్లి పోలీసులను తమ ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అయితే పోలీసులు సమాధానం వారిని నిరాశకు గురిచేసింది. దీంతో తమ వారికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. 24 మంది ట్రాన్స్‌జెండర్లు తమతో తెచ్చుకున్న ప్లోర్ క్లీనర్ లిక్విడ్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలు ప్రారంభించాలని 24 మంది ట్రాన్స్‌జెండర్లకు మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు తెలుస్తుంది.






