Crime News: గర్ల్‌ఫ్రెండ్ న్యూడ్ ఫొటోలను లీక్ చేసిన బాయ్‌ఫ్రెండ్..

by Dishafeatures2 |
Crime News: గర్ల్‌ఫ్రెండ్ న్యూడ్ ఫొటోలను లీక్ చేసిన బాయ్‌ఫ్రెండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతి నగ్న చిత్రాలను ఆమె బాయ్‌ఫ్రెండే సోషల్ మీడియాలో లీక్ చేశాడు. 22 ఏళ్ల యువకుడు చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. అతడిని శిక్షించాలని, యువతికి న్యాయం చేయాలని నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌ రాంచీలోని దోరండాలో నివాసం ఉంటున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జార్ఖండ్‌లోని 22 ఏళ్ల స్కెచ్ ఆర్టిస్ట్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం అయింది.

ఢిల్లీలో ఉండే యువతికి, నిందితుడికి మధ్య కొంతకాలం ప్రేమాయణం కూడా నడిచిందని పోలీసులు గుర్తించారు. అయితే అతడి స్కెచ్ ఆర్ట్‌కి, సోషల్ మీడియాలో అతడికి ఉన్న ఫాలోవర్స్‌ను చూసి ఇంప్రెస్ అయిపోయి ప్రేమలో పడిపోయిందని తెలిపారు. కానీ వారు తొలిసారి కలిసినప్పుడు అతడి ఫోన్‌లో ఆ యువతి నగ్న చిత్రాలు ఉండటం ఆమె చూసిందని, దాంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన యువతి అతడితో బ్రేకప్ చెప్పేసింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో లీక్ చేశాడని పోలీసులు తెలిపారు.

Also Read : 46 ఏళ్ల వయసులో ఘాటు ప్రేమ.. నలుగురితో కలిసి రూ.188లకే..


Next Story

Most Viewed