- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RA స్టూడియోలో దారుణం.. ఆడిషన్ పేరుతో 20 మంది పిల్లల కిడ్నాప్
ఆడిషన్ పేరుతో 20 మంది పిల్లల కిడ్నాప్

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని ముంబై(Mumbai) నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆడిషన్ పేరుతో నగరంలోని ఆర్‌ఏ స్టూడియో(RA Studio) ప్రతినిధులు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలను పిలిపించుకున్నారు. ఆడిషన్ అంటూ నమ్మించి అందరినీ ఒక గదిలో బంధించారు(Children Kidnapped). పిల్లలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రుల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ రోహిత్ ఆర్యగా పోలీసులు గుర్తించారు. అతను పిల్లలను చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం రోహిత్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. పిల్లలు అందరినీ పేరెంట్స్ దగ్గరకు సేఫ్‌గా చేర్చారు. కాగా, ఆడిషన్స్ కోసం మొత్తం 100 మందికిపైగా పిల్లలు రాగా, అందులో 20 మందిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. అయితే.. రోహిత్ అనే వ్యక్తి కొందరు ప్రముఖులతో మాట్లాడాలనుకున్నాడని.. నేరుగా ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేని కారణంగా పిల్లలను కిడ్నాప్ చేసి.. ఆ ప్రముఖులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వీడియో






