తననే పెళ్లి చేసుకోవాలని అన్న టార్చర్.. ఒప్పుకోక పోవడంతో హత్య.. మెడకు చున్నీ బిగించి, ఐదో అంతస్తు నుంచి తోసి.. (వీడియో)

by Sujitha Rachapalli |

ఢిల్లీ జ్యోతి నగర్‌లో దారుణ హత్య జరిగింది. 19ఏళ్ల నేహ తనతో పెళ్లికి ఒప్పుకోవట్లేదని చంపేశాడు తౌఫీక్ అనే యువకుడు. బురఖా ధరించి మారువేషంలో నేహా ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు.. ఆమె దుపట్టాతో గొంతు బిగించి,

తననే పెళ్లి చేసుకోవాలని అన్న టార్చర్.. ఒప్పుకోక పోవడంతో హత్య.. మెడకు చున్నీ బిగించి, ఐదో అంతస్తు నుంచి తోసి.. (వీడియో)
X

దిశ, వెబ్‌సైట్ : ఢిల్లీ జ్యోతి నగర్‌లో దారుణ హత్య జరిగింది. 19ఏళ్ల నేహ తనతో పెళ్లికి ఒప్పుకోవట్లేదని చంపేశాడు తౌఫీక్ అనే యువకుడు. బురఖా ధరించి మారువేషంలో నేహా ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు.. ఆమె దుపట్టాతో గొంతు బిగించి, సోమవారం ఉదయం ఐదవ అంతస్తు టెర్రస్ నుంచి కిందకు తోసాడు. దీంతో తీవ్రగాయాలైన ఆమెను గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా ఆమె తండ్రి సురేందర్ కుమార్ ఈ భయానక ఘటనను చూడగా.. తౌఫీక్ తనను నెట్టివేసినట్లు తెలిపాడు.

కాగా నేహా ఒకప్పుడు తౌఫీక్‌కు రాఖీ కట్టి అతన్ని సోదరుడిగా భావించింది. కాగా తౌఫీక్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం రాత్రి.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో అరెస్ట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో ఆరు పోలీసు బృందాలు అతని కోసం గాలించాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో తౌఫీక్ తన గుర్తింపును దాచడానికి బురఖా ధరించి భవనంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించబడింది. నేహా కుటుంబం వెల్లడించిన వివరాల ప్రకారం.. తౌఫీక్ స్థానిక కిరాణా దుకాణంలో పనిచేసేవాడు. అతను మూడేళ్లుగా వారికి తెలుసని.. నేహా అతనితో దూరం పాటించిన తర్వాత నెలల తరబడి ఆమెను వేధించాడని తెలిపారు.

VIDEO

Next Story