లింగ మార్పిడి చేయించుకోవాలని ఒత్తిడి.. కుక్కతో లైంగిక చర్య.. దారుణంగా 19ఏళ్ల కుర్రాడి జీవితం..

by Sujitha Rachapalli |

* 19 ఏళ్ల యువకుడి జీవితం దారుణాతి దారుణం * లింగ మార్పిడి చేయించుకోవాలని ఒత్తిడి * కుక్కతో లైంగిక చర్యలో పాల్గొనాలని టార్చర్

లింగ మార్పిడి చేయించుకోవాలని ఒత్తిడి.. కుక్కతో లైంగిక చర్య.. దారుణంగా 19ఏళ్ల కుర్రాడి జీవితం..
X

దిశ, వెబ్ డెస్క్ : ముంబైలోని మలాడ్ ఏరియాలో 19ఏళ్ల బి. కమ్ విద్యార్థిని లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని తోటి స్నేహితులు ఒత్తిడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మెంటల్‌గా, ఫిజికల్‌గా టార్చర్ చేయడం పెరిగింది. దీంతో అతను పోలీసులను సంప్రదించాడు. మలాడ్ వెస్ట్‌లోని మల్వానీ నివాసి కార్తిక్ వేదమాని నికామ్‌తో ఈ విద్యార్థికి అనుకోకుండా స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఓ పెద్ద గ్రూప్‌లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది.

కార్తిక్ నేహా ఖాన్ ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ భాస్కర్ శెట్టి, మహీ ఖాన్ అనే వ్యక్తులుఉన్నారు. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవాలని ఒత్తిడి చేశారు. తిరస్కరించడంతో గదిలో లాక్ చేశారు. శారీరకంగా హింసించి. వీధి కుక్కలో లైంగిక చర్యలో పాల్గొనేలా బలవంతం చేశారు. ఈ చర్యను వీడియోలో బంధించి.. బెదిరించారు. వాట్సాప్ ద్వారా అతని తల్లికి పంపిస్తామని బెదిరించి పది వేలు లాగారు. ఆ తర్వాత కూడా మరింత టార్చర్ పెరిగింది. వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. మరిన్ని డబ్బులు కావాలని.. జెండర్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్జరీ చేసుకోవాలని ఒత్తిడి చేశారు. సూరత్‌లో ఓ ఆస్పత్రిలో చేర్చారు. కానీ సర్జరీకి ముందే తప్పించుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నెట్ వర్క్ నడుపుతున్న వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.

Next Story