- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్(Rajasthan)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం మటోడా ప్రాంతంలో లారీని టెంపో ట్రావెలర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా జోథ్‌పూర్‌లోని సుర్‌సాగర్ వాసులుగా గుర్తించారు. ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






