పదిహేడు రోజుల పిల్లాడిని క్రూరంగా హత్య చేసిన నలుగురు మేనత్తలు.. చేతులు కాళ్లు విరిచి.. గొంతు పిసికి.. జుట్టు పీకేసి..

by Sujitha Rachapalli |

రాజస్థాన్ జోధ్‌పూర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది.17 రోజుల పిల్లాడిని క్రూరంగా హత్య చేశారు నలుగురు మేనత్తలు. చేతులు, కాళ్లు విరిచేసి.. గొంతు నొక్కి.. జుట్టు పీకేసి.. దారుణంగా హతమార్చారు.

పదిహేడు రోజుల పిల్లాడిని క్రూరంగా హత్య చేసిన నలుగురు మేనత్తలు.. చేతులు కాళ్లు విరిచి.. గొంతు పిసికి.. జుట్టు పీకేసి..
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ జోధ్‌పూర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది.17 రోజుల పిల్లాడిని క్రూరంగా హత్య చేశారు నలుగురు మేనత్తలు. చేతులు, కాళ్లు విరిచేసి.. గొంతు నొక్కి.. జుట్టు పీకేసి.. దారుణంగా హతమార్చారు. కుటుంబ వివాదాలు, ఈర్ష్య వల్లనే తన కొడుకును హత్య చేశారని.. పిల్లాడి తండ్రి చెప్తుండగా.. పొరుగింటి వాళ్లు మాత్రం దీన్ని బ్లాక్ మ్యాజిక్‌గా చెప్తున్నారు. చాలా రోజులుగా ఆ ఇంట్లో మంత్రాలు జరుగుతున్నాయని.. భయానక సంఘటనలు జరుగుతుండేవని ఆరోపిస్తున్నారు. కాగా నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ లేదా కక్షల కోణంలో హత్య జరిగిందా అనే విషయంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

Next Story