- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
START.. STOP.. QUIT..16 ఏళ్ల బాలిక సూసైడ్ నోట్ సంచలనం.. పోలీసులు కూడా షాక్..
పదహారేళ్ల బాలిక.. ముంబైలోని టాప్ స్కూల్‌లో చదువుతుంది.. అనుకోకుండా ఒక రోజు 18వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. యాక్టివ్‌గా ఉండే పాప ఇలా చేసిందేంటని అందరూ షాక్ అయ్యారు. తల్లిదండ్రులకు దు:ఖమే మిగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : పదహారేళ్ల బాలిక.. ముంబైలోని టాప్ స్కూల్‌లో చదువుతుంది.. అనుకోకుండా ఒక రోజు 18వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. యాక్టివ్‌గా ఉండే పాప ఇలా చేసిందేంటని అందరూ షాక్ అయ్యారు. తల్లిదండ్రులకు దు:ఖమే మిగిలింది. దీనిపై ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు.. ఆమె రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో రాసిన START.. STOP.. QUIT..అంశాల గురించి చదివి షాక్ అయ్యారు.
ఇంతకీ ఆమె ఏం రాసిందంటే START కాలమ్‌లో.. పేరెంట్స్ నమ్మాలి.. చదువుపై ఫోకస్ చేయాలి.. ఇంట్లో మంచిగా ప్రవర్తించాలి.. పేరెంట్స్‌తో మాట్లాడాలి.. అని రాసింది. ఇక STOP కాలమ్‌లో.. ఐ పిల్స్ తీసుకోవడం మానేయాలి.. డ్రగ్స్ తీసుకోవడం మానేయాలి.. సోషల్ మీడియాను కంటిన్యూయస్‌గా స్క్రోల్ చేయకూడదు.. అని రాసుకుంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఓ పోలీస్ ఆఫీసర్ పాడ్‌కాస్ట్‌లో పంచుకోగా.. డ్రగ్స్‌కు అలవాటుపడితే యూ టర్న్ తీసుకోవడం కష్టమని.. మనం ఈ తరాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఆయన చెప్పిన ప్రతీ సెంటెన్స్ కరెక్ట్ అని.. డ్రగ్స్ ఎన్నో కుటుంబాలను నాశనం చేశాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






