- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మురికివాడలో గ్యాస్ లీక్.. ఊపిరాడక 16 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని మురికివాడలో విషాదం చోటు చేసుకుంది. మురికివాడలో గుర్తు తెలియని గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 16 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని మురికివాడలో విషాదం చోటు చేసుకుంది. మురికివాడలో గుర్తు తెలియని గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 16 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మృతుల్లో చిన్నారులు కూడా ఉండగా.. సంవత్సరం వయస్సు గల బాలుడు కూడా మృతి చెందాడు. గ్యాస్ లీక్‌కు అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో గ్యాస్ లీక్ కారణంగా ఊపిరి ఆడక చనిపోయిన వారి మృతదేహాలు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ చెప్పారు. ఈ విషాద సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జోహన్నెస్‌బర్గ్ అధికారులు తెలిపారు.
Next Story






