- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు పిల్లల తండ్రి.. 15ఏళ్ల బాలికపై అత్యాచారం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. 15ఏళ్ల మైనర్ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నామక్కల్ ప్రభుత్వాసుపత్రిలో మైనర్ ప్రసవించడంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. 15ఏళ్ల మైనర్ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నామక్కల్ ప్రభుత్వాసుపత్రిలో మైనర్ ప్రసవించడంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. నిందితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అని తేలింది.
ముదలైపట్టి ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ మెకానిక్ షాపు నడిపిస్తుంటాడు. 2023లో మైనర్ బాలిక తన ద్విచక్ర వాహనం రిపేర్ కోసం అక్కడికి రాగా అతనితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చదువు మానేసిన బాలిక.. ఆ ప్రాంతంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పని చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు ఒంటరిగా కలవడం జరిగేది. ఓ రోజు ఏకంగా ఆమెను తన ఇంటికి పిలిచిన సతీష్ కుమార్.. అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు బాలికను ఈ విషయం గురించి అడగ్గా.. సతీష్ కుమార్ తనను ఇంటికి పిలిచి బలవంతం చేశాడని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపారు.






