- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు పుట్టలేదని.. ఏడాదిన్నర బిడ్డను చంపిన తండ్రి..
ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కూతురు పుట్టడంపై కొందరు నిరాశ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొడుకు పుడితే బాగుండేదని అసహనంతో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే స్త్రీల

దిశ, వెబ్ డెస్క్: ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కూతురు పుట్టడంపై కొందరు నిరాశ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొడుకు పుడితే బాగుండేదని అసహనంతో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే స్త్రీల సంఖ్య క్రమంగా తగ్గుతుందని.. ఆడపిల్లలను పురిట్లోనే చంపొద్దని ఎన్నో ఎన్జీఓ సంస్థలు, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న అమ్మాయిని తక్కువగా అంచనా వేయొద్దని సూచిస్తున్నాయి. కానీ తారతమ్యం చూపిస్తేనే ఉన్నారు. ఇదే మూర్ఖత్వంలో ఉన్న ఓ తండ్రి ఏడాదిన్నర పాపను నదిలో పడేసి చంపేశాడు.
ఉత్తరప్రదేశ్ జౌన్పూర్‌కు చెందిన అశోక్, సంజు దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం రుత్బి కూడా ఆడపిల్ల కావడంతో ఫ్యామిలీలో అసహనం వ్యక్తమైంది. అశోక్ కూడా పాప పుట్టుకతో హ్యాపీగా లేకపోవడమే కాదు ఆమెను బయటకు తీసుకెళ్తున్నానని చెప్పి రెండు కిలోమీటర్లు వెళ్లి నదిలో పడేశాడు. అక్కడ ఉన్న వ్యక్తులు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. అయితే రుత్బిని చంపాలనుకోవడం ఇది మొదటిసారి కాదని.. అశోక్ ఇంతకు ముందు కూడా పాపపై మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్పింది తల్లి. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.






