- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురు అబ్బాయిలతో అభ్యంతరకర స్థితిలో కూతురు.. తల్లి మందలించడంతో దారుణం
బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. అబ్బాయిలతో తిరగొద్దని చెప్పినందుకు 15ఏళ్ల కూతురు తల్లినే హత్య చేసింది. ఈ ఘటన బెంగుళూరులోని సుబ్రహ్మణ్యపుర ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. అబ్బాయిలతో తిరగొద్దని చెప్పినందుకు 15ఏళ్ల కూతురు తల్లినే హత్య చేసింది. ఈ ఘటన బెంగుళూరులోని సుబ్రహ్మణ్యపుర ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఠాణా పరిధిలో ఇటీవల ఓ మహిళ మృతి చెందగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. కాగా విచారణలో కన్నకూతురే తల్లిని చంపినట్టు తేలింది. బాలిక తన స్నేహితులైన నలుగురు 17ఏళ్ల లోపు అబ్బాయిలను అక్టోబర్25 ఇంటికి పిలుపించుకుంది. ఆ సమయంలో పక్క గదిలో తల్లి వారి మాటలు విని లేచింది.
కూతురు అభ్యంతరకర స్థితిలో ఉండటంతో తల్లి మందలించగా అప్పటికే పథకం వేసుకున్న వారు ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. తరవాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్ కు కట్టి వేలాడదీశారు. తరవాత అక్కడి నుండి పారిపోగా ఇంటికి వచ్చిన మృతురాలి సోదరి స్థానికులు, బంధువులను పిలిచి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అయితే అంత్యక్రియలకు బాలిక రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో కూతురే హంతకురాలు అని తేలింది. బాలికతో పాటు మరో నలుగురు బాలురను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.






