వెబ్ సిరీస్‌‌కు బానిసైన బాలుడు.. హీరోమాటలతో ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-09 05:17:17  IST  )

కంటెంట్ బాగున్నా, బాలేకపోయినా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లకు ప్రేక్షకులు అలవాటుపడ్డారు.

వెబ్ సిరీస్‌‌కు బానిసైన బాలుడు.. హీరోమాటలతో ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కంటెంట్ బాగున్నా, బాలేకపోయినా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లకు ప్రేక్షకులు అలవాటుపడ్డారు. ఇంట్లోనే వినోదం దొరుకుతుండటం ఇందుకు ఒక ముఖ్య కారణం. ఎంటర్టైన్ మెంట్ కోసం చూస్తే ఓకే.. కానీ కొందరు ఓటీటీలకు బానిసలవుతున్నారు. తెలియకుండానే ఓటీటీల్లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లకు అలవాటుపడి అదేపనిగా చూస్తుండటంతో మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతోంది. అలా ఓటీటీలో ఒక జపనీస్ వెబ్ సిరీస్ కు బానిసైన బాలుడు.. అందులో హీరో మాటల్ని నమ్మి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను రాసిన సూసైడ్ తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసింది.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం (ఆగస్టు 4) బెంగళూరులో గాంధార్ అనే 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ కు ముందు అతను రాసిన లెటర్లో.. "అమ్మా, నాన్న మీరు 14 సంవత్సరాలు నన్ను బాగా పెంచారు. మీతో కలిసి ఉన్న క్షణాల్లో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. మీరు ఈ లెటర్ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా" అని పేర్కొన్నాడు. స్కూల్లో ఎంతో బాగా చదివే గాంధార్ కు ఎవరితోనూ గొడవలు లేవు. అయినా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలియక గుండెలవిసేలా రోధించారు. అయితే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం తెలిసింది.

గాంధార్ ఓ జపనీస్ వెబ్ సిరీస్ కు బానిసయ్యాడు. ఆ సిరీస్ లోని క్యారెక్టర్ బొమ్మను గాంధార్ తన గదిలోని గోడపై గీశాడు. హీరో దగ్గరుంటే మ్యాజిక్ బుక్ లో ఎవరు చనిపోవాలని పేరు రాస్తాడో వారు చనిపోతుంటారు. ఈ సిరీస్ కు అడిక్ట్ అయిన గాంధార్.. హీరో మాటల్ని, చేష్టల్ని నమ్మి తన ప్రాణం తీసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.

Next Story