- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చరియలు.. 14 మంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కారణంగా కొండచరియలు విరిగిపడి (Landslides) 14 మంది మృతి (14 people died) చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. తూర్పు నేపాల్ (Eastern Nepal)లోని కోషి ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ ల్యాండ్ స్లైడ్ ప్రమాదం చోటు చేసుకుంది. ఇలాం జిల్లాలోని సూర్యోదయ మునిసిపాలిటీలోని మానేభంజ్యాంగ్‌లో ఐదుగురు మరణించగా, పటేగాన్, మాన్సేబుంగ్, డ్యూమా, ధుసుని, రత్మాటే, ఘోసాంగ్ ప్రాంతాల్లో మరో తొమ్మిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో నేపాల్ సైన్యం సహాయక చర్యల కోసం హెలికాప్టర్ (Helicopter)ను పంపింది. అలాగే ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ దళాలను (Defense Forces) మోహరించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో నివాసాలు నేలమట్టం అయ్యాయి. వాటిల్లోని ప్రజలు మిస్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రక్షణ చర్యలు ప్రారంభం అయితే.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






