13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల ఘాతుకం.. గ్యాంగ్ రే*ప్ చేసి, వీడియో తీసి..

by Naga Rani Yarlagadda |

13 ఏళ్ల బాలికపై ముగ్గురు అఘాయిత్యానికి తెగబడ్డారు. వారి వయసు 14-15 ఏళ్ల మధ్య ఉంటుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల ఘాతుకం.. గ్యాంగ్ రే*ప్ చేసి, వీడియో తీసి..
X

దిశ, వెబ్‌డెస్క్: పదమూడేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగింది. నిందితుల వయసు 14 -15 సంవత్సరాలు ఉంటుందని, వారిలో ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి.. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. తాము చెప్పినట్లు వినకపోతే చంపుతామని బెదిరించి.. ఒకరితర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఈ విషయాన్ని బాలిక ఎవరికైనా చెప్తుందని భయపడి.. జరిగిందంతా వీడియో తీశామని, విషయం బయటకు చెప్తే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన పేరెంట్స్.. ఏమైందని అడగడంతో విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని, వారి మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు హైస్కూల్ స్టూడెంట్స్ కాగా.. మరొకరు చదువును మధ్యలో ఆపేశాడని హుబ్బళ్లి - ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు. ప్రస్తుతం బాలికకు రక్షణ కల్పించినట్లు చెప్పారు. చేసిన దారుణాన్ని వీడియో తీయడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిజంగా వీడియోలు తీసి ఉంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Next Story