- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 ఏళ్ల బాలుడి మర్డర్.. లైంగిక అవయవాలు ముక్కలు ముక్కలుగా చేసి.. క్రూరంగా హత్య
ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో 12ఏళ్ల బాలుడి హత్య కలకలం రేపుతోంది. పురా గ్రామానికి చెందిన రంజిత్ యాదవ్‌కు సాహిల్ యాదవ్ ఒక్కడే కుమారుడు. కాగా అక్టోబర్ 26న ఆదివారం కావడంతో ఆవులను మేపేందుకు వెళ్లాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో 12ఏళ్ల బాలుడి హత్య కలకలం రేపుతోంది. పురా గ్రామానికి చెందిన రంజిత్ యాదవ్‌కు సాహిల్ యాదవ్ ఒక్కడే కుమారుడు. కాగా అక్టోబర్ 26న ఆదివారం కావడంతో ఆవులను మేపేందుకు వెళ్లాడు. కానీ రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో మొత్తం వెతికారు. కానీ దొరకలేదు. తర్వాత రోజు ఉదయం పత్తి స్టోరేజీ చేసిన గది బయట నుంచి తాళం పెట్టి ఉండడాన్ని గమనించిన తల్లి.. బలవంతంగా ఓపెన్ చేసింది. పత్తి కింద రక్తపు మడుగులో కొడుకు శవాన్ని గుర్తించి బోరుమంది. బాలుడి గొంతు చీల్చి.. లైంగిక అవయవాలను ముక్కలు ముక్కలుగా చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలతోపాటు భయం అలుముకుంది.
పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని.. ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో రక్తనమూనాలు, వేలి ముద్రలు, హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.అయితే సాహిల్ తండ్రి.. తనకు తన సోదరితో ఉన్న ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని ఆరోపించాడు. దీంతో అనుమానితులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.






