ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-14 13:02:14  IST  )

బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనం

ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌(Rajasthan)లోని జైసల్మేర్‌లో ఘోర ప్రమాదం(Bus Accident) చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం తైయాట్‌ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్‌ సమీపంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటిహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయాలైన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story