- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం, 50 మందికి సీరియస్
మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం, 50 మందికి సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్(Rajasthan)లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్మదా(Harmada) పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహమండీలో సోమవారం మధ్యాహ్నం ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పదిమంది దుర్మరణం(10 People Dead) చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. నిన్న రాత్రే రాజస్థాన్‌లోని ఫలోదీలో ఆగి ఉన్న ఓ ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడువక ముందే మరో ప్రమాదం జరగడం.. మళ్లీ పదుల సంఖ్యలో పౌరులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వరుస దుర్ఘటనలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సాయం అందించాలని, క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Read More... రెప్పపాటులో ఘోరం జరిగింది.. బస్ కండక్టర్ రోదన






