- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబాబ్ నచ్చలేదని వంట మనిషిని..
కబాబ్ టేస్ట్ గా లేదని ఇద్దరు వ్యక్తులు వంట మనిషిని కాల్చిన దారుణ ఘటన యూపీలోని బరేలీలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కబాబ్ టేస్ట్ గా లేదని ఇద్దరు వ్యక్తులు వంట మనిషిని కాల్చిన దారుణ ఘటన యూపీలోని బరేలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీలోని ప్రేమ్ నగర్ లోని ప్రేమ్ నగర్ లో ఉన్న ఓ కబాబ్ దుకాణానికి కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అల్కహాల్ తాగిన వారు కబాబ్ రుచిగా లేదని యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలో బిల్లు చెల్లించకుండా కారు వద్దకు వెళ్లారు. వారి దగ్గర రూ.120 వసూలు చేయాలని ఓనర్ వంట మనిషిని ఆదేశించాడు. దీంతో వంట మనిషి నసీర్ వారి వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి వంట మనిషి నసీర్ కణతపై తుపాకీ తో కాల్చాడు. దీంతో నసీర్ అక్కడిక్కడే కుప్పకూలాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Next Story






