- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిఖనిలో పాత కక్షలతో యువకుడిపై దాడి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: పాత కక్షలతో కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ద్వారకా నగర్ కు చెందిన వంశీకృష్ణపై అదే కాలనీకి కొంతమంది దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం… మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలు దృష్టిలో పెట్టుకుని అదను చూసిన యువకులు వంశీకృష్ణను తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన వంశీకృష్ణ ప్రస్తుతం స్థానిక […]</p>

X
దిశ, కరీంనగర్: పాత కక్షలతో కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ద్వారకా నగర్ కు చెందిన వంశీకృష్ణపై అదే కాలనీకి కొంతమంది దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం… మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలు దృష్టిలో పెట్టుకుని అదను చూసిన యువకులు వంశీకృష్ణను తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన వంశీకృష్ణ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లో దాడి సంఘటన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






