- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోర్షే వద్దని బీఎండబ్ల్యూ తీసుకున్న యువీ.. ఆ 6 సిక్సర్ల బ్యాట్ విలువ ఇప్పుడు 50 పోర్షే కార్లకు పైనే
మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ.. టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ.. టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన చారిత్రక ఘట్టం వెనుక జరిగిన ఒక సరదా సంఘటనను తాజాగా ‘ది ఓవర్‌లాప్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో మోడీ ఆఫర్
‘2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో నేను భారత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఆటగాళ్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాను. టోర్నీలో ఎవరైనా ఒకే మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు కొట్టినా లేదా ఆరు వికెట్లు తీసినా.. వారికి ఖరీదైన ‘పోర్షే’ కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించాను. ఆ తర్వాత నా కళ్ల ముందే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు సిక్సర్లు బాదాడు. ఆ చారిత్రక ఓవర్ పూర్తవగానే యువీ నేరుగా నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ‘నా పోర్షే కారు ఎక్కడ?’ అని అడిగాడు’ అని మోడీ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
ఆరు నెలలు ఆగలేక.. బీఎండబ్ల్యూకు మొగ్గు
అయితే, అప్పట్లో పోర్షే కారును ఇండియాకు దిగుమతి చేసుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టేది. అంతకాలం కారు కోసం నిరీక్షించడం ఇష్టం లేని యువరాజ్.. ‘నేను అంతకాలం ఆగలేను, ఇప్పుడే అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ (BMW) కారు ఇప్పించండి’ అని అడిగాడు. దీంతో షోరూమ్‌కి వెళ్లి బీఎండబ్ల్యూ కారు కొని యువీకి ఆ కారు తాళాలు అందించినట్లు లలిత్ మోడీ తెలిపారు.
ఆ బ్యాట్ నా దగ్గరే ఉంది..
కారు తీసుకున్న ఆనందంలో యువరాజ్.. తను ఆరు సిక్సర్లు కొట్టిన ఆ చారిత్రాత్మక బ్యాట్‌ను సంతోషంగా లలిత్ మోడీకి బహుమతిగా ఇచ్చాడు. దాన్ని తీసుకున్న మోడీ, తన ఇంట్లో ఫ్రేమ్ కట్టించి భద్రపరుచుకున్నారు. ‘పోర్షే బదులు బీఎండబ్ల్యూ తీసుకుని యువీ అప్పట్లో అమాయకత్వం ప్రదర్శించాడు. కానీ, యువీ నాకు ఇచ్చిన ఆ బ్యాట్ నా వద్దే భద్రంగా ఉంది. దాని విలువ ఇప్పుడు 50 పోర్షే కార్ల కంటే ఎక్కువే ఉంటుంది’ అని లలిత్ మోడీ సగర్వంగా చెప్పుకొచ్చారు.






