- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రౌండ్‌లో వార్నర్, మొయిన్ అలీ మధ్య గొడవ? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 లో కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మొయిన్ అలీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 లో కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మొయిన్ అలీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. గురువారం రావల్పిండి పిండిస్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే గ్రౌండ్‌లో వార్నర్ తీవ్ర ఆవేశంతో మొయిన్ అలీ వైపు వెళ్లడం, వెంటనే టీమ్ డైరెక్టర్ హైదర్ అజర్ కల్పించుకుని వారిని విడదీసినట్లు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇది చూసిన అభిమానులు సీనియర్ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిందని, జట్టులో విభేదాలు వచ్చాయని చర్చించుకున్నారు.
వీడియో డేవిడ్ వార్నర్, హైదర్ అజర్ స్పందన
నెట్టింట జరుగుతున్న ప్రచారంపై డేవిడ్ వార్నర్, టీమ్ డైరెక్టర్ హైదర్ అజర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అదంతా కేవలం ఆటపట్టించడంలో భాగమేనని వారు కొట్టిపారేశారు. మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి జట్టుకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుగా వెళ్లాలంటూ టీమ్ డైరెక్టర్‌తో తాము సరదాగా వ్యవహరించామని వార్నర్ పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్టుకు షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపైనే చర్చ జరిగిందని వార్నర్ క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ హైదర్ అజర్ కూడా దీనిని ధృవీకరించారు. దీంతో ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని స్పష్టమైంది. అయితే మైదానంలో వార్నర్ ప్రవర్తన చూస్తుంటే అది కేవలం ‘కవరింగ్’ మాత్రమేనని నెటిజన్లు భావిస్తున్నారు.
ఆయనో జోకర్.. సంజీవ్ గోయెంకాను బ్యాన్ చేయండి.. లక్నో ఓనర్‍పై లలిత్ మోడీ ఫైర్






