ఇర‌గ‌దీసిన‌ వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్..10 ఏళ్లకే సెంచరీ

by velandi.Saikiran |

వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ 10 ఏళ్లకే సెంచరీ కొట్టాడు.

ఇర‌గ‌దీసిన‌ వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్..10 ఏళ్లకే సెంచరీ
X

దిశ‌, వెబ్ డెస్క్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మొన్న ఐపీఎల్ సందర్భంగా అదర గొట్టిన సంగతి తెలిసిందే. ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా, త్వరలో భారత జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతోంది. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ ఫ్యామిలీ నుంచి మరో టాలెంట్ బయటకు వచ్చింది. వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ పదేళ్ల వయసులోనే సెంచరీ కొట్టేశాడు.

బీహార్ లో లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా పదేళ్ల బుడ్డోడు ఆశీర్వాద్ సెంచరీ బాదాడు. తాజ్ పూర్‌ క్రికెట్ అకాడమీ తరఫున 87 బంతుల్లో ఓ సిక్సర్, 20 బౌండరీలు సాధించాడు. ఈ క్రమంలోనే 103 పరుగులు సాధించాడు. తన అన్నలాగా దూకుడుగా కాకుండా.. ఓపికగా బ్యాటింగ్ చేస్తూ, తన సత్తా చాటాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు ఉజ్వల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీంతో ఆశీర్వాద్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైభ‌వ్ లాగే ఐపీఎల్ లోకి రావాల‌ని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ల‌వ‌ర్స్‌.

Next Story