- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీలక పరిణామం.. మాజీ ఎంపీ కేశినేని నాని పై కేసు నమోదు
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసులు బీఎన్ఎస్, ఐటీ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ కేశినేని నాని (Former MP Keshineni Nani) పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా విజయవాడ(Vijayawada)లో కేశినేని బ్రదర్స్(Kesineni Brothers) మధ్య వివాదం కొనసాగుతుండగా.. తాజాగా అది ముదిరింది. దీంతో వారి రాజకీయ వివాదం కాస్త ఇప్పుడు వ్యక్తిగత వివాదంగా మారింది. ఇద్దరి మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా.. తాజాగా మాజీ ఎంపీ కేశినేని నాని(Former MP Kesineni Nani) తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని(MP Kesineni Chinni)పై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఎంపీ కేశినేని చిన్ని(MP Keshineni Chinni) పై ఫిర్యాదు చేస్తూ ఈడీకి లేఖ రాశారు.
ఈ ఆరోపణలపై స్పందించిన కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. తనపై కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే ఉర్సా క్లస్టర్స్ అంశంపై నాని గతంలో రాని లేఖపై పోలీసులకు చిన్ని ఫిర్యాదు చేశారు. అయితే తన లీగల్ నోటీసు తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగిందని చిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నాని పై బీఎన్ఎస్, ఐటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.






