- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మా ఇంటి బంగారం'కు బిజినెస్ కష్టాలు?
సమంత – నందిని రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రాలేదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అయితే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సమంత – నందిని రెడ్డి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం కావడంతో మొదట ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తర్వాత విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో సినిమాపై బలమైన బజ్ క్రియేట్ కాలేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మేకర్స్ ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రాలేదని సమాచారం. అయితే విడుదల తర్వాత సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి సమంత ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది? ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.







