క్యూట్ ఫోటోలతో ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన టీమిండియా పేసర్ అర్షదీప్!

by Ramesh Naini |

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించాడు.

క్యూట్ ఫోటోలతో ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన టీమిండియా పేసర్ అర్షదీప్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ సమ్రీన్ కౌర్‌తో కలిసి దిగిన రెండు రొమాంటిక్ ఫోటోలను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. వాటికి ‘మై పర్సన్’ (నా మనిషి) అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు ఈ కొత్త జంటకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఐపీఎల్ 2026 నుంచే మొదలైన ప్రచారం..

నిజానికి ఐపీఎల్ 2026 సమయంలోనే వీరిద్దరి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. మే 11న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ముందు అర్షదీప్ తన గర్ల్‌ఫ్రెండ్ బ్యాగులు మోస్తూ, ఆమెతో చేతిలో చెయ్యేసుకుని తిరుగుతున్న వీడియో ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అప్పటి నుంచే వీరిద్దరిపై నెట్టింట జోరుగా చర్చ జరగగా.. తాజాగా ఆ వదంతులను నిజం చేస్తూ అర్షదీప్ తమ బంధాన్ని అఫీషియల్ చేశాడు.

Next Story