- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగూలీ పేరుతో తప్పుడు రాతలు..పోలీసులను ఆశ్రయించిన దాదా..!
పోలీసులను సౌరభ్ గంగూలీ ఆశ్రయించారు.

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా పోలీసులను ఆశ్రయించారు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించే కంటెంట్ ప్రచారం అవుతోందని ఈ సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ అనే అనధికార ఫేస్ బుక్ పేజీతో పాటు మరో మీడియా సంస్థ తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నట్లు సౌరవ్ గంగూలీ గుర్తించారు. ఈ క్రమంలోనే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సౌరవ్ గంగూలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు మొదలు పెట్టారు. ఎంతటి వారైనా వాళ్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు పోలీసులు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, చాలా భారత జట్టు తరఫున 1992లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు సౌరవ్ గంగూలీ. తన కెరీర్ లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. అలాగే భారత జట్టు కెప్టెన్ గా పనిచేసిన ఆయన, బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు.






