చాహల్‌‌తో డేటింగ్ పై RJ మహ్వాష్ క్లారిటీ..సూ*సైడ్ చేసుకుంటాడ‌నే భ‌యంతో !

by velandi.Saikiran |

చాహల్‌తో డేటింగ్ రూమర్లు వ‌చ్చిన త‌రుణంలో ఆర్జే మహ్వాష్ క్లారిటీ ఇచ్చారు.

చాహల్‌‌తో డేటింగ్ పై RJ మహ్వాష్ క్లారిటీ..సూ*సైడ్ చేసుకుంటాడ‌నే భ‌యంతో !
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తో డేటింగ్, బ్రేకప్ వార్తలపై RJ మహ్వాష్ క్లారిటీ ఇచ్చారు. చాలా మంది తమ గురించి తప్పుడుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు పోస్టులు కూడా పెట్టినట్లు ఓ పాడ్ కాస్ట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు RJ మహ్వాష్. ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సమయంలో యుజ్వేంద్ర చాహల్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడని పేర్కొన్నారు.

మేం కేవ‌లం స్నేహితుల మాత్రమే - RJ మహ్వాష్

ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నట్లు చాహల్ పలు ఇంటర్వ్యూలలో చెప్పినట్లు గుర్తు చేశారు RJ మహ్వాష్. అలాంటి సమయంలో చాహల్ కు మంచి ఫ్రెండ్ తోడు అవసరం ఉందని.. ఆ ఫేజ్ నుంచి తను బయటపడేలా అందరం కలిసి సహాయం చేసినట్లు వివరించారు. అందుకే చాహల్ తో కాస్త క్లోజ్ అయ్యానని తెలిపారు. కానీ చిన్న విషయాలను జనాలు సెన్సేషనల్ చేశారని మండిపడ్డారు. చాహల్ తో స్నేహం మాత్రమే చేశానని కుండబద్దలు కొట్టి చెప్పారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని తేల్చి చెప్పారు.

Next Story