మ‌రో స్టార్ క్రికెట‌ర్ రిటైర్మెంట్ !

by velandi.Saikiran |

రషీద్ ఖాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని పోస్టులు వైర‌ల్ గా మారాయి.

మ‌రో స్టార్ క్రికెట‌ర్ రిటైర్మెంట్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య శనివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ టెస్ట్ సిరీస్ లో రషీద్ ఖాన్ లేకపోవడం పైన ఆసక్తికర చర్చ మొదలైంది. త్వరలో అతడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ రిచర్డ్ పైబస్ చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. రషీద్ ఖాన్ దీర్ఘకాలిక నడుము నొప్పితో బాధపడుతున్నారని... టెస్టులకు దూరం కావాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

రషీద్ ఖాన్ రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటున్నానని.. కానీ తుది నిర్ణయం మాత్రం అతడిదేనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని పోస్టులు వైర‌ల్ గా మారాయి. అయితే ఇండియాతో టెస్ట్ సిరీస్ ఫినిష్ అయ్యాక రిటైర్మెంట్ ఇస్తారా ? లేక కాస్త సమయం తీసుకుంటారా ? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఆఫ్గనిస్తాన్ వర్సెస్ భారత జట్ల మధ్య ముల్లాన్‌పూర్ వేదికగా శనివారం 9:30 గంటలకు ఏకైక టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గిల్ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

Next Story